telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండో పెళ్లి చేసుకుంటే సమస్యలు రావా… నటి ఫైర్

Shewtha

జీవితంలో సరైన వ్యక్తి దొరక్క ఏకంగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. 1998లో రాజా చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు శ్వేత. ఆ తర్వాత భర్తతో గొడవలు వచ్చి విడిపోయారు. అనంతరం అభినవ్ కోహ్లీ అనే నటుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ మగపిల్లాడు పుట్టాడు. అయితే పెళ్లికి ముందు వరకు బాగానే ఉన్న అభినవ్.. ఆ తర్వాత శ్వేత కూతురిని లైంగికంగా వేధించాడు. చేయి చేసుకున్నాడు. దాంతో శ్వేత తన రెండో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వేరుగా ఉంటోంది. అయితే రెండో పెళ్లిలో కూడా సమస్యలు ఎలా వస్తాయంటూ చాలా మంది నెటిజన్లు శ్వేతపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిందరికీ శ్వేత సరైన సమాధానం చెప్పి నోరుమూయించారు. “నా రెండు చేతుల్లో ఒక చెయ్యి పనిచేయకపోతే మరో చేత్తో పని చేసుకుంటాను. అంతేకానీ జీవించడమే మానేయలేను. అదే విధంగా నా జీవితంలో భాగమైన నా భర్తతో సమస్య వస్తే జీవించడం ఆపలేను. నా పిల్లల్ని నేను చూసుకోవాలి. చాలా మంది రెండో పెళ్లి చేసుకున్నాక కూడా సమస్యలు ఎలా వస్తాయి అని అడుగుతున్నారు. వారందరినీ నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఎందుకు సమస్యలు రావు. నేను కనీసం ధైర్యంగా బయటికి వచ్చి ఈ విషయాలు చెప్పుకోగలుగుతున్నాను. కొందరు పెళ్లయ్యాక కూడా ప్రియుడిని, ప్రియురాళ్లను మెయింటైన్ చేస్తున్నారు. వారికంటే నేను బెటర్ కదా” అంటూ వివరణ ఇచ్చారు. పెళ్లికి ముందు అందరూ బాగానే ఉంటారు. పెళ్లయ్యాక అసలు స్వరూపాన్ని బయటపెట్టేవారు ఉంటారు. అందుకే అమ్మాయిలు, అబ్బాయిలు గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుని ఆ తర్వాత బాధపడుతుంటారు. ఈ బాధలు సామాన్య ప్రజలే కాదు సినీ ప్రముఖులు కూడా అనుభవిస్తున్నారు.

Related posts