telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సామాజిక

మొబైల్ లో .. తెలంగాణ దేవాలయ సేవలు .. రూములు కూడా ..

telangana temples smart services app

తెలంగాణాలో కొత్త వరవడి సృష్టిస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీ ఆప్ ఫోలియో (T App Folio) ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఆప్ నుంచే భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి సేవలు, అక్కడి గదులు బుక్ చేసుకోవచ్చు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్ నిర్మాణం జరుగుతుంది. అందుకు రూములుకాని, స్వామివారి సేవలు మాత్రం ఇప్పుడు అందుబాటులో లేవు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలు, గదులు ఈ ఆప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం సేవలు, విరాళాలు ఆప్ ద్వారా చెల్లించవచ్చు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం సేవలు, గదులను ఆన్‌లైన్‌లో ఈ ఆప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Related posts