telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

లోన్ యాప్స్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్…

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ…ఇన్సటెంట్ లోన్ యాప్స్ కేసులో లో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాము అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. రాచకొండ సైబర్ క్రైమ్ లో నమోదైన రెండు కేసులు నమోదయ్యాయి.. ఉప్పల్ కు చెందిన బుమన్నా ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాం. ఎలాంటి లోన్ అప్లై చెయ్యకుండా 26 వేలు తన అకౌంట్ లో జమ అయ్యాయి. 14 లోన్ అప్లికేషన్లు అతని మొబైల్ లో వచ్చాయి. లోన్ జమ అయిన తర్వాత వేధింపులు స్టార్ట్ చేశారు. అతని కి వచ్చిన కాల్స్ ద్వారా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసాం అని పేర్కొన్నారు. కాల్ సెంటర్ జియా లియాంగ్ ఇన్ఫో టెక్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ను నడిపిస్తున్నారు. పూణే లో 600 మందితో ఈ కాల్ సెంటర్ నడిపిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరశురామ్ తో పాటు భార్య లియాంగ్ టియాన్ , హెచ్ ఆర్ మేనేజర్ షేక్ ఆకిబ్ లను అరెస్ట్ చేసాం. 101 లాప్ టాప్ లు,106 మొబైల్ ఫోన్స్, సీసీటీవీ కెమెరా డివిఆర్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలు కంపెనీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. కంపెనీ కి చెందిన hdfc బ్యాంక్ లో ఉన్న 1.42 కోట్ల ఖాతాలు ఫ్రీజ్ చేసాం అని పేర్కొన్నారు.

Related posts