telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నయన్ పెళ్ళికి .. జతకమే సమస్యనా.. అంత నమ్మేస్తున్నారా..

nayanatara movie ira grand release

నయనతార పలు బాషలలో చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన ఈ అమ్మడు హీరోలకి సమానంగా ఫాలోయింగ్ పెంచుకుంది. త్వరలో దర్భార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ అమ్మడు ఇటీవల తన బర్త్‌డే కోసం ప్రియుడితో కలిసి న్యూయార్క్ వెళ్లింది. అక్కడ విఘ్నేష్ శివన్‌తో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నయనతార- విఘ్నేష్ శివన్‌లు కొంత కాలంగా డేటింగ్‌లో ఉండగా, వీరి పెళ్లెప్పుడు అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. జాతకరీత్యా పెళ్లి అనే సరికి ఏదో ఒక సమస్య వస్తుండడంతో నయనతార పెళ్ళికి దూరంగా ఉండాలని అనుకుంటుందట. గతంలో శింబుతో పెళ్లి మూడు ముళ్లు వరకు వెళ్లి ఆగింది. ప్రభుదేవాతోను అంతే జరిగింది. మూడోసారి కూడా అలా జరగకుండా ఉండాలనే పెళ్ళి టాపిక్ తీయడం లేదట నయనతార. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.

Related posts