telugu navyamedia
తెలంగాణ వార్తలు

మహిళలు ఎలా ఉండాలి.. ఏ బట్టలు ధరించాలి? వాళ్ల ఇష్ట‌మే – క‌ల్వ‌కుంట్ల క‌విత‌

క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్​ వేదిక‌గా స్పందించారు. సింధూరం ధరించడం స్త్రీల వ్యక్తిగత స్వేఛ్చ అయితే హిజాబ్ కూడా వ్యక్తిగత స్వేచ్ఛే అని ఆమె అభిప్రాయపడ్డారు. స్త్రీలు స్వంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉందన్నారు..

గ‌త‌నెల‌లో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న హిజాబ్ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. కర్ణాటకలో హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను గేటు వద్దే అడ్డుకున్న ఘటనలు ఇటీవల సంచలనం సృష్టించాయి.ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్‌కోడ్‌ ప్రకారం హిజాబ్‌లు ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

దీంతో హిజాబ్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నిర్ణయాలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ హిజాబ్ వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హిజాబ్‌కు వ్యతిరేకంగా స్పందించారు. 

మహిళలు ఎలా ఉండాలి. ఏ బట్టలు ధరించాలి? ఏం చేయాలనేది మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని సూచించారు .మహిళలు సృష్టికర్తలన్న కవిత… మహిళలకు సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని గుర్తుచేశారు. ఈ సందర్బంగా తనురాసిన కవితను ఆమె ట్విటర్​లో పోస్ట్​ చేశారు.

Related posts