సినీ పరిశ్రమ ప్రముఖులు వచ్చి చర్చలు జరపడంతో సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమం అయిందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది.
అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..సమస్యల పరిష్కారనికి కృషి చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడినా చిరంజీవి పెద్ద మనసు చేసుకున్నారన్నారు. ఎదిగే కొద్ది ఒదగడం అంటే చిరంజీవి అని పేర్నినాని కొనియాడారు.
చిరంజీవి.. సినీ పరిశ్రమ సమస్యలన్నీ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అలాగే నారాయణమూర్తి చిన్న సినిమాలపైతన ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
హాజరైన వారందరూ టాలీవుడ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఏపీలో షూటింగ్‌లు..ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్ చెప్పారని తెలిపారు.
అప్పలనాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు: రోజా