telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మాజీ మంత్రి ఉమా పై మంత్రి కొడాలి ఫైర్

Devineni kodali

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్షాల పై విమర్శల దాడికి సిద్ధమవుతున్నారు నాయకులూ. అయితే తాజాగా మాజీ మంత్రి ఉమా పై మంత్రి కొడాలి ఫైర్ అయ్యారు. అన్న వదినల వర్ధంతి చందాలు వేసి చేసే చరిత్ర ఉమాది అని కొడాలి ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నాను లేకపోతే ఉమా ను చెప్పు తీసుకుని కొట్టేవాడినని ఆయన అన్నారు. ఎవడో గుడివాడలో చేపల చేరువుపై పేకాట ఆడితే మా పోలీసులు పట్టుకున్నారని, నన్ను భ్రష్టు పట్టించటానికి నేను పేకాట ఆడిస్తూన్నారు అని విమర్శలు చేశారని అన్నారు. బ్రోకర్ పనులు చేసి డబ్బులు సంపాదించేది ఉమా అని, నేను ఫోన్ చేసి తిట్టినా సిగ్గులేని వ్యక్తి ఉమా అని ఆయన అన్నారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇంటికి వచ్చి ఉమాకి బడిత పూజ చేస్తానని అన్నారు. లేకపోతే నా పేరు కొడాలి నాని కాదు అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి కొడాలి నాని విమర్శలకు దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఉదయం 10గంటలకు గొల్లపూడి యన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని దేవినేని ఉమ పేర్కొన్నారు. రేపు సీఎం వస్తారో మంత్రి కొడాలి నాని వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు దేవినేని ఉమ. గొల్లపూడి లో దీక్షకు కూర్చుంటా…టచ్ చేసి చూడు అంటూ ఉమ కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, తనపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష అంటున్నారు ఉమ. బాబాయి ని ఎవరు హత్య చేశారో జగన్ ని నిలదీసే ధైర్యం మంత్రికి ఉందా ? అని ప్రశ్నించిన ఆయన సిగ్గు శరం ఉంటే తన శాఖకు సంబంధించి రూ.2వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల డబ్బులు రైతులకు ఇప్పించాలని అన్నారు. చూడాలి మరి ఇది ఎక్కడివరకు వెళ్తుంది అనేది.

Related posts