సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల ఖర్చును మీడియా సర్టిఫై మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) లెక్కకడుతోంది. కృష్ణ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 225 మంది బరిలో ఉన్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధానంగా సోషల్ మీడియాతో పాటు ఇతర మాద్యమాలైన టీవీ, పత్రికలు, మిగిలిన ఏ రూపంలోనైనా ప్రకటనలిచ్చేందుకు ఎంసీఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరి.
అయితే మార్చి 31 నాటికి 20 మంది అభ్యర్థులు ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ మొత్తం అభ్యర్థుల ఖర్చును సుమారు రూ.26 లక్షలుగా ఎంసీఎంసీ లెక్కించింది. మార్చి 31 తర్వాత మరో 60 మంది అభ్యర్థులు అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఖర్చుల వివరాలు రావాల్సి ఉంది. అయితే అనుమతులు తీసుకోకుండా ప్రసార మాద్యమాలలో ప్రచారం చేస్తున్న 8 మంది అభ్యర్థులను ఎంసీఎంసీ గుర్తించింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఎండీ ఇంతియాజ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఆయా ప్రకటనలపై వివరణ కోరుతూ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు.
అక్రమ కేసులతో కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి