ఎంతో స్వేచ్ఛ ఉన్నదనుకునే అమెరికా లో పోలీసులు డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. జార్జియాలో కొందరు పోలీసులు పిట్ట రెట్టకు, డ్రగ్స్ కు తేడా తెలియక పొరబాటున ఓ ఫుట్ బాల్ ప్లేయర్ ను అరెస్ట్ చేశారు. సవన్నా సిటీలో జరిగిందీ ఘటన. షాయ్ వెర్ట్స్ (21) అనే కుర్రాడు జార్జియా సదరన్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతడు యూనివర్శిటీ సాకర్ టీమ్ సభ్యుడు కూడా. అయితే, గత నెలలో షాయ్ వెర్ట్స్ కారులో వేగంగా వెళుతుండగా క్లింటన్ ప్రాంతంలో అతడిని పోలీసులు నిలువరించారు. ఆపై కారును తనిఖీ చేస్తుండగా, బాయ్ నెట్ పై తెల్లని పదార్థం కనిపించింది.
అది మాదకద్రవ్యంగా భావించిన పోలీసులు వెర్ట్స్ పై నార్కోటిక్ కేసు నమోదు చేశారు. పోలీసు కేసు నేపథ్యంలో వర్శిటీ కూడా అతడిపై వేటు వేసింది. చివరికి కోర్టులో కానీ అసలు విషయం తేలలేదు. ఆ తెల్లని పదార్థం పక్షి రెట్ట తప్ప మరొకటి కాదని, కావాలంటే పరీక్షించుకోవాలని వెర్ట్స్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. దాంతో పరీక్ష నిర్వహించగా అది డ్రగ్ కాదని తేలింది. దాంతో అధికవేగం అభియోగాలపై మాత్రమే జరిమానా విధించారు. తమ క్రీడాకారుడు నిర్దోషి అని తేలడంతో యూనివర్శిటీ మళ్లీ అతడికి స్వాగతం పలికింది.
అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు: చంద్రబాబు