telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వాతావరణ సూచన : తెలంగాణలో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షం…

మరత్వాడా మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

నిన్నటి తూర్పు గాలులలో ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి అంతర్గత మహారాష్ట్ర మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ వరకు 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి లేదా గాలి విచ్చిన్నత ఈరోజు బలహీన పడింది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హెచ్చరిక : ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ పట్టణ, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం మరియు భద్రాద్రి కొతగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు ఈ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు మరియు వడగళ్ల వర్షం సంభవించే అవకాశం ఉంది.
ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు మరియు వడగళ్ల వర్షం సంభవించే అవకాశం ఉంది.

Related posts