బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు.. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన ఇంట్లోని వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు దాదా.. దాంతో.. హుటాహుటిన గంగూలీని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్‌కు గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త ఒక్కసారి గా గంగూలీ ఫ్యాన్స్‌ను, క్రికెట్ ప్రేమికులను, క్రీడాభిమానులకు షాక్‌కు గురిచేసింది.. దాదా త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఇక, సౌరవ్ ఆరోగ్యంపై సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ఆసక్తికర ట్వీట్ చేశారు. “సౌరవ్‌గంగూలీ త్వరగా కోలుకోవాలి… గెట్ వెల్ సూన్.. ప్రార్థిస్తున్నా ” అంటూ ఆమె ట్వీట్ చేశారు. నగ్మా ఒక్కరనే కాదు… పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై స్పందించారు. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త తనను చాలా కలిచి వేసిందని.. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు.
previous post