దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై దర్శకుడు టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ ను ప్రేమించే ఓ గిరిజన అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఆ పాత్ర సినిమాలో చాలా తక్కువ సమయం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్‌లు, టీజర్‌లు అన్నీ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఆ స్టార్ హీరోని పెళ్ళి చేసుకుని ఉండేదానిని… రకుల్ కామెంట్స్