telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆర్కే బీచ్‌లో గల్లంతైన యువకుల కోసం గాలింపు..

విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది.  గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. నేవీ హెలికాప్టర్‌ సాయంతో సముద్రంలో గాలించిన సిబ్బంది డెడ్‌బాడీని వెలికితీసారు.. మృతులు  హైదరాబాద్‌కు చెందిన శివ గుర్తించారు. మరో యువకుడు ఆజీజ్‌ కోసం గాలిస్తున్నారు.

ఆదివారం విహారయాత్రకు వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ఓ యువతి, ఓ యువకుడు మృతి చెందారు.. లభ్యమై వారిలో ఒడిశాకు చెందిన సునీతా త్రిపాఠి, హైదరాబాద్‌కు చెందిన చంద్రికా సాయి గుర్తించారు.

గల్లంతైన మ‌రో ఇద్ద‌రు కోసం రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్‌.. గజ ఈతగాళ్లతో స‌హాయంతో మృత‌దేహాల‌ను వెలికితీస్తున్నారు.

వేర్వేరు ఘటనల్లో గల్లంతైన వారు హైదరాబాద్, ఒడిశా నుంచి విశాఖకు విహారయాత్రకు వచ్చినట్టు తెలుస్తోంది..హైదరాబాద్- బేగంపేట్ కి చెందిన 8 మంది యువకులు.. నిన్న స్నానానికి ఆర్కే బీచ్‌లోకి దిగారు. పెద్ద కెరటాలు రావడంతో ఇందులో ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు.

కొద్దిసేపటికే శివ అనే వ్యక్తిని లైఫ్‌ గార్డ్స్‌ ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న శివను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. శివ మృతి చెందాడు. మహ్మద్ అజీజ్  కోసం గాలింపు కొనసాగుతోంది

ఒడిశాలోని భద్రక్‌ జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు సైతం ఆర్‌కే బీచ్‌కు వచ్చారు. వీరు.. స్నానం చేసేందుకు.. సముద్రంలో దిగారు. పెద్ద కెరటం నెట్టడంతో విద్యార్థిని సుమిత్రా త్రిపాఠి అనే యువతి నీటిలో మునిగిపోయింది. కొంతసమయం తర్వాత… శవమై ఒడ్డుకు చేరింది. మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. సుమిత్రా త్రిపాఠితోపాటు.. హైదరాబాద్ యువకుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 

కాగా.. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్‌కే బీచ్‌లో దాదాపు 20 వేల మంది ప్రజలు కనిపించారు.

Related posts