telugu navyamedia
సినిమా వార్తలు

సినీ ప‌రిశ్ర‌మ‌కు ఈరోజు శుభ‌ప‌రిణామం..

సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామమని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. ఆరు , ఏడు నెలలుగా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కన్ఫ్యూజన్‌లో ఉందని.. ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన చిరంజీవికి తొలుత కృత‌జ్ఞత‌లు చెప్పుకోవాల‌న్నాడు.

నిజానికి ఇవాళ చాలా పెద్ద రిలీఫ్‌గా ఉంది..వెరీ హ్యాపీ.. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ పేర్ని నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని వివరించారు.

త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని.. వారం లేదా ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని మహేష్ చెప్పాడు. అలాగే సీఎం జగన్‌కు చాలా పెద్ద ధ్యాంక్స్‌ అని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు అన్నారు.

Related posts