telugu navyamedia
సినిమా వార్తలు

సినీ ప‌రిశ్ర‌మ‌ల స‌మ‌స్య‌ల‌కు శుభం కార్డు ప‌డింది..

* సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు సంతృప్తినిచ్చాయి.

* చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామం
*త‌క్కువ‌రేటుకువినోదం అందించాల‌న్న‌ది ప్ర‌భుత్వం ఉద్దేశం..
*సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన సీని ప్ర‌ముఖులు భేటి..

*టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం
*సీఎం జ‌గ‌న్‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌త‌రుపున ధ‌న్య‌వాదాలు..
*ఈ నెల మూడ‌వ వారంలో 3 జివో వ‌స్తుంద‌ని అనుకుంటున్నాం..
*మంత్రి పేర్నినాని చొర‌వ‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయి..
*ఏపీ సినీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేయాల‌న్నారు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జగన్‌తో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు.  చిన్న సినిమాలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నరని అండగా ఉంటామని హమీ ఇచ్చారు.

అలాగే చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు.సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని కొనియాడారు.

హైదరాబాద్‌ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరంజీవి తెలిపారు. . సీఎం నిర్ణయానికి తమవంతు సహకారం ఉంటుంది.

దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటా అని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు.

Related posts