దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. బన్నీ ఉత్సవంలో మునుపటి లాగే పగిలాయి తలలు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించు కునేందుకు రెండు వర్గాలుగా విడిపోయారు భక్తులు. జైత్రయాత్రలో రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు భక్తులు. దాంతో దేవరగట్టులో యుద్ద వాతావరణం కొనసాగింది. ఆ యుద్ధంలో రక్తం చిందించింది దేవరగట్టు. ఏం చేయలేక ప్రేక్షక పాత్ర వచించారు పోలీసులు. దేవరగట్టులో వైద్య సిబ్బందిని, తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయలేదు అధికారులు. క్షత గాత్రులను ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. అయితే దసరా సందర్బంగా దేవరగట్టులో జోరుగా నాటుసారా విక్రయాలు జరిగాయి. ఆ మత్తులోనే ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు. అయితే ముందుగా కరోనా కట్టడిలో భాగంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలు రద్దు చేసారు అధికారులు. కానీ దేవరగట్టులో భక్తుల రాక ద్రుష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అధికారులు. దాంతో దేవరగట్టుకు దాదాపు లక్ష మంది దాకా భక్తులు రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
previous post
ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు: యనమల