telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అపరిష్కృత కేసుల పరిష్కారానికి .. 2 ప్రత్యేక బెంచ్ లు..

2 benches for criminal cases

తెలంగాణ చీఫ్ జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహన్ 1.87 లక్షల అపరిష్కృత క్రిమినల్ కేసుల పరిష్కారమే ధ్యేయంగా 2 ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్ లు ప్రత్యేకంగా క్రిమినల్ కేసుల విచారణ మరియు పరిష్కారాలకు మాత్రమే అని చెప్పారు. ఈ ప్రత్యేక బెంచ్ లు కేవలం శనివారాలు మాత్రమే పని చేస్తామన్నారు. మొదటి మరియు మూడవ శనివారాలలో శ్రీ చౌహన్ గారు మిగిలిని రోజుల్లో జస్టిస్ శ్రీదేవి గారి సమక్షంలో జరుగుతాయి.

తెలంగాణ హై కోర్ట్ లో జడ్జిల పరిమాణం తక్కువగా ఉందని 24 మందికిగాను 14 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని, ఇంకా పరిమాణం 42 కు పెంచుట కొరకు ఇదివరకే ఢిల్లీ ఉన్నతాధికారులకు అర్జీ పెట్టినట్టు తెలిపాడు. ఈ శనివారాలలో పని చెయ్యటం అనేది ఒక సంచలనమే అంటున్నారు నిపుణులు.

Related posts