కాళేశ్వరం ప్రాజక్టు తెలంగాణలో ఇంజినీర్ ల అద్భుతంగా పేర్కొనే భారీ ప్రాజక్టు. ఈ ప్రాజక్టులో భాగంగా అనేక బ్యారేజిలు ఉన్నాయి. అయితే వీటికి తాజాగా దేవతలు పేర్లు పెట్టారు. మేడిగడ్డ బ్యారేజికి లక్ష్మీ బ్యారేజిగా నామకరణం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ కు లక్ష్మీ పంప్ హౌస్ అని పేరుపెట్టారు. అన్నారం బ్యారేజికి సరస్వతి బ్యారేజి అని, సిరిపురం పంప్ హౌస్ కు సరస్వతి పంప్ హౌస్ అని నామకరణం చేశారు.
సుందిళ్ల బ్యారేజికి పార్వతి బ్యారేజి, గోలివాడ పంప్ హౌస్ కు పార్వతి పంప్ హౌస్, నందిమేడారం రిజర్వాయర్ కమ్ పంప్ హౌస్ కు నంది పంప్ హౌస్, లక్ష్మీపురం పంప్ హౌస్ కు గాయత్రీ పంప్ హౌస్ అని పేరు పెట్టారు. కాళేశ్వరం ప్రాజక్టు ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే.