telugu navyamedia
రాజకీయ వార్తలు

మహిళలు 112 యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార ఘటనపై నేడు కూడా పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. సభలో మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని మహిళలందరికి నేను ఒక్కటే విన్నవిస్తున్నాన్ని చెప్పారు.

ప్రతి ఒక్కరూ 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ యాప్ ను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, రైల్వే పోలీసులు, విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు స్పందిస్తారు. 112 హెల్ప్ లైన్ ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలకూ నిధులను కూడా విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.

Related posts