telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆయుస్మాన్ భారత్ ని తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం…

Kcr telangana cm

ఆరోగ్య శ్రీ తో పాటు ఆయుస్మాన్ భారత్ ని తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు సీఎస్ సోమేష్ కుమార్… ఇవాళ ఢిల్లీలోని బీఆర్కే భవన్ నుండి ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించిందని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించిందని గుర్తుచేశారు.. ఇక, సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని డొవెటైల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని మోడీకి తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు.  కాగా, గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆయుష్మాన్ భారత్‌ పథకంపై విభేదాలు చోటు చేసుకున్నాయి… అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినా.. ఆయుష్మాన్ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందంటూ చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. మరోవైపు.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హస్తినలో పర్యటించారు సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు మరికొందరిని కలిశారు.. కానీ, ఈ పర్యటన తర్వాత కేసీఆర్‌లో మార్పు వచ్చిందనే చర్చ సాగుతోంది.. ఢిల్లీ పర్యటన తర్వాత.. వరుసగా కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. మొన్నటి మొన్న కేంద్ర వ్యవసాయ చట్టాలను సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..

Related posts