telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భక్తుల ఇండ్లవద్దకే మేడారం బస్సులు

medaram jatara

తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీలోపల దైవదర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల సౌకర్యార్థం అధనపు బస్సులను నడుపనున్నారు.

జాతరకు వెళ్ళే భక్తుల ఇండ్లవద్దకే బస్సులు పంపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదనపు సమాచారం, బస్సుల బుకింగ్‌ కోసం డిపో మేనేజర్‌7893088433, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) 7382924742 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Related posts