telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

50 ఏళ్లగా ఓటమి ఎరగని .. శరత్ పవార్ ..

sarad pawar in loksabha elections as contestant

శరద్ పవార్ కు రాజకీయాల్లో 50 ఏళ్లకు పైబడిన అనుభవం… 14 సార్లు ఎన్నిక్లలో పోటీచేసినా ఓటమినెరుగని ఘనత సొంతం. అందుకే ఆయనను రాజకీయాల్లో మహారధి అని అభివర్ణిస్తుంటారు. మహారాష్ట్రలో ఆయన కేవలం తన సత్తాతోనే గెలుస్తూ వస్తున్నారనే వాదన వినిపిస్తుంటుంది. 1967లో రాజకీయాల్లో కాలుమోపిన శరద్ పవార్ నాలుగుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఆయన రాజకీయ అనుభవం చేత, ప్రధాని పదవికి అర్హుల జాబితాలోరూ పవార్ పేరు వినిపిస్తుంటుంది. 1940, డిసెంబరు 12న ఆయన పూణెలో జన్మించారు. కామర్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. 1967లో కాంగ్రెస్ తరపున బారామతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. తరువాత 1978, 1983, 1985 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. 2014లో ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని శరద్ పవార్ నిర్ణయించుకున్నారు. అయినా తాజాగా మళ్ళీ బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం విశేషం. అంటే మళ్ళీ ఆయన గెలుపు తథ్యం అని పోటీదారులు నిష్క్రమించవచ్చు.. లేని పక్షంలో ఓటమి అవమానం తప్పదు.

Related posts