ప్రణాళికలు రచించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని జనసేన అధినేత పనవ్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మాదిరిగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన తిరుపతిలోని ఆర్సీ రోడ్డు వద్ద ఉన్న రైతు బజార్ కు వెళ్లారు.
రైతు బజార్ లో ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరడంతో వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఉల్లికోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన విమర్శించారు. ప్రతి విషయానికి గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని విమర్శించారు. సమర్థత లేకపోతే తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని పవన్ డిమాండ్ చేశారు.