విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక నేత, మంత్రి కేటీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు వెనక్కి తగ్గవద్దని పిలుపునిచ్చారు. అయినప్పటికీ…కేంద్ర ప్రభుత్వం మాత్రం… స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని మొండిపట్టు పట్టింది. అయితే.. తాజాగా ప్రైవేటీకరణపై మనస్తాపం చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్ సంచలనం సృష్టస్తోంది. “ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కోసం ఇవాళ 5:49 నిమిషాలకు త్యాగం చేస్తున్నాను” అంటూ శ్రీనివాసరావు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
previous post
next post