telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

రాహుల్ గాంధీ.. తెలంగాణాలో రెండు రోజుల పర్యటనకు సై.. ఉత్సాహంలో శ్రేణులు ..

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు పర్యటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈమేరకు పార్టీ నాయకత్వానికి సమాచారం ఇస్తూ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీపెద్దలు ఆదేశించారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ ఒకటిన రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో సభల నిర్వహణకు టీపీసీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన కూడా రాహుల్‌ రాష్ట్రంలో రెండో విడత పర్యటిస్తారని, ఎక్కడ సభలు నిర్వహించాలో నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవాని ఢిల్లీ వర్గాలు టీపీసీసీకి సమాచారం ఇచ్చాయి. దీనితో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో కాంగ్రెస్‌ పెద్దలు నిమగ్నమై ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో 9వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది.

Related posts