telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇవాళే ధరణి పోర్టల్ కు ముహూర్తం.. సీఎం కేసీఆర్ చేతులమీదుగా

Kcr telangana cm

ధరణి ఫోర్టలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు .గురువారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా మేడ్చల్ జిల్లా, మూడుచింతలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మండల కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేధికపై ధరణి ఫోర్టల్ స్విచ్ ఆన్ చేసి ధరణి ఫోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొమ్మిది అంచెలలో ఈ కింది విధంగా ఉంటుంది.

1. ధరణి ఫోర్టల్లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫార్మాట్లో పూర్తి వివరాలను నమోదు చేసి అమ్మకందారుడి పాలుక్ నంబర్ ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోవాలి.

2. ఈ చలాన్లో ప్రభుత్వం సూచించిన విధంగా స్టాండ్యూటీ, ప్రభుత్వ నిబంధలకు లోబడి ఇతర చార్జీలను ఆన్లైన్లో చెల్లించాలి.

3. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లోనే అపాయింట్ మెంట్ కు సంబంధించిన వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి.

4. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సాక్షుల వివరాలను డాటా ఎంట్రీ ఆపరేటర్ నమోదు చేసుకుని బయోమెట్రికకు రెకమెండ్ చేస్తారు.

5. భూమి కొనుగోలుదారుల, విక్రయదారులతో పాటు సాక్షుల ఫొటోలను, బయోమెట్రిక్ తీసుకుంటారు.

6. డాటా ఎంట్రీ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలను స్కాన్ చేసి ప్రింట్ ఇవ్వడంతో పాటు తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లాగిన్ లోకి పంపుతారు.

7. తహశీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తన లాగి లోకి వచ్చిన డాక్యుమెంట్ ను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకం, మ్యూటేషన్ చేస్తారు.

8. తహశీల్దార్, జాయింట్ సబ్ అజిస్ట్రార్ హోదాలో సదరు డాక్యుమెంట్లు అజిస్ట్రేషన్ కొరకు అంగీకరిస్తారు.

9. తహసీరార్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పీపీ బీ (పట్టాదారు పాస్ బుక్) / ఈపీపీబీ (ఎల్రావిక్ పట్టాదారు పాస్ బుడ్)లను, మ్యూజేషన్ పత్రాలను కొనుగోలుదారికి వెంటనే అందిస్తారు. క్రయవిక్రయదారులు ఇంట్లో కూర్చొని గానీ, ఇంతర డాటా ఎంట్రీ కార్యాలయాల వద్ద గాని రిజిస్ట్రేషన్ డాటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసి ఆన్ లైన్ లో ఈ చాలాన్ చెల్లించి తహసీల్దార్ కార్యాలయంలో కేవలం 8-10 నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

Related posts