telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. బాకీలు వసూలు అవుతాయి.. ఉద్యోగంలో సమస్యలు..

today rasi falalu

మేషం : పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

వృషభం : కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం : వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకం : కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

సింహం : వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..

కన్య : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానా లు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిసా ్తయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల : పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం : ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు : కుటుంబంలో శుభకార్యాలు. ఆ ర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. భూలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మకరం : సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ధన్యయం.

కుంభం : పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

మీనం : వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

Related posts