telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ లో … స్వాతంత్రదినోత్సవ వేడుకలు .. అమిత్ షా ముఖ్యఅతిథి..

august 15th celebrations in J & K with amitsha

జమ్మూకశ్మీర్ లో భారీగా రక్షణ దళాలను పెట్టిమరీ ఆర్టికల్ 370 ని రద్దు చేశారని, తద్వారా కశ్మీర్ లో తప్పకుండా రగడ జరుగుతుందని చాలామంది భావించారు. కశ్మీరీ పార్టీలు కూడా అదేవిధంగా అనుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన తరువాత కశ్మీర్ లో పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు అర్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందటం ఖాయం అని సంతోషం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సోఫియన్ ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతం. మొన్నటి వరకు ఉగ్రవాదంతో అట్టుడికిన ప్రాంతం. ఆ ప్రాంతంలో పరిస్థితులు నార్మల్ గా ఉండే చూడటం చాలా అవసరం. ప్రజలను మోటివేట్ చేయడం చాలా అవసరం. ప్రస్తుతం అజిత్ దోవల్ అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడుతున్నారు. అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేస్తూ ఆర్టికల్ 370 రద్దు వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.

పిల్లల చదువుల నుండి మొదలుకొని వాళ్లకు కావాల్సిన ఉద్యోగాలు, హాస్పిటల్ వంటి వాటి గురించి వాళ్లతో చర్చిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాశ్మీర్ కు మంచి రోజులు రాబోతున్నాయని వివరించారు. చాలామంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి అజిత్ దోవల్ ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే.. త్వరలోనే పరిస్థితులు నార్మల్ గా వస్తాయని, భపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అతి త్వరలోనే కేంద్ర హోమ్ శాఖా మంత్రి జమ్మూ కాశ్మీర్ లో పర్యటించబోతున్నారు. అన్ని విషయాలను ప్రజలకు వివరించబోతున్నారు. పరిస్థితులు నార్మల్ కాగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఇకపై జాతీయ జెండాను అవమానించినా, జాతీయ గీతాన్ని అవమానించినా తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆగష్టు 15 వ తేదీన జమ్మూ కాశ్మీర్ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొనే అవకాశం ఉన్నది.

Related posts