telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విమాన ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన కేంద్రం !

airport muscot

మోడీ ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి.. పెట్రోల్‌ వరకు రేట్లు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులపై చాలా వరకు భారం పడుతోంది. తాజాగా మరో షాక్‌ ఇచ్చింది కేంద్రం. విమాన ప్రయాణికులకు షాక్‌ తగలనుంది. విమాన టికెట్ల ధరల కనిష్ఠ పరిమితిని 5 శాతం మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమాన ఇంధనం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి శుక్రవారం పేర్కొన్నారు. అయితే విమాన టికెట్ల ధరల గరిష్ట పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటీఎఫ్‌ ధరల పెరుగుదల కారణంగా దేశీయ విమాన టికెట్ల ధరల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను గత నెలలో కేంద్రం 10-30 శాతం పెంచింది. గతేడాది మే నెలలో దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించిన సందర్భంగా విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించి టికెట్ల ధరలపై పరిమితులు విధించారు.

Related posts