telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలో వర్షాలు… అయిన ఆగని రైతుల నిరసనలు

కొత్త వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దేశరాజధాని సరిహద్దుల్లో … తమ నిరసనను తెలుపుతూనే ఉన్నారు. ప్రభుత్వం జరిపిన ఏడో విడత చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో… 40వ రోజూ తమ ఆందోళనను కొనసాగించారు. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు.  ఢిల్లీలో కురుస్తున్న అకాల వర్షం… రైతుల నిరసనకు ఏమాత్రం అడ్డు కాలేదు. వర్షంలోనే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు అన్నదాతలు. కేంద్రానికి, రైతుసంఘాలకు మధ్య సోమవారం జరిగిన ఏడో దఫా చర్చలు కూడా విఫలం కావడంతో… మరోసారి ఈనెల 8న భేటీకి నిర్ణయించారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయడమే తమ ప్రధాన డిమాండ్‌ అని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తుండగా… మొండి వైఖరి వీడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. చట్టాల్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని  చెబుతోంది. కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో.. ఇవాళ రైతు సంఘాలు సమావేశం కానున్నాయి. భవిష్యత్‌ కార్యాచరణపై  నిర్ణయం తీసుకోనున్నాయి.  తమ జీవితమే సంఘర్షణతో కూడుకున్నదని చెబుతున్నారు రైతులు. ఈ ఉద్యమంలో భాగంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లు.. అసలు లెక్కే కాదంటున్నారు రైతులు.

Related posts