telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ద‌ర్శ‌కేంద్రుడి మాజీ కోడ‌లుకు మళ్ళీ పెళ్ళి…

మన తెలుగు దర్శకులలో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రారావు కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఆయన మాజీ కోడ‌లు, ర‌చ‌యిత‌ క‌నికా థిల్లాన్ పెళ్లైపోయింది. బాలీవుడ్ స్క్రీన్ రైట‌ర్ హిమాన్షు శర్మను వివాహం చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు. వివాహానికి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా థిల్లాన్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌యాణం అని కామెంట్ పెట్టింది. కనికా థిల్లాన్‌, హిమాన్షుశ‌ర్మ‌ గత సంవత్సరం డేటింగ్ ప్రారంభించారు. అంతే కాకుండా వారిపై వ‌స్తున్న వార్త‌ల్ని నిజం చేస్తూ గత ఏడాది జూన్‌లో త‌మ‌ సంబంధం గురించి ప్రకటించారు. ఇక వీరిద్ద‌రి ప్ర‌స్తుత ప్రాజెక్టుల విష‌యానికి వ‌స్తే.. హిమాన్షు.. అక్ష‌య్ కుమార్, అత్రాంగీ రేచిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. క‌నికా.. తాప్సీ హ‌సీన్ దిల్‌రూబా, రాజ్‌కుమార్ హిరానీ త‌దుపరి చిత్రంల‌కు ప‌ని చేస్తుంది. కనికా థిల్లాన్ ఇంతకుముందు దర్శకుడు రాఘవేంద్రరావు త‌న‌యుడు సూర్య ప్రకాష్ ను వివాహం చేసుకుని ఆ తరువాత విడిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆమెకే రెండో పెళ్లి జరిగింది.

Related posts