telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కాఫి వల్ల ఆ పైలెట్లకు గుండె జారినంత పనయ్యింది…!

Plane

లండన్‌ లో ఓ విమానం పైలెట్ కు కాఫీ ముచ్చెమటలు పట్టించింది. విమానం కదలికలను నియంత్రించే కంట్రోల్‌ ప్యానల్‌పై అనుకోకుండా కాఫీ పడినందుకు ఆ పైలట్ల ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. విద్యుత్‌ తీగలు కాలుతున్న వాసన రావడంతో వాళ్లు వణికిపోయారు. ఇక మరోమారు ఆలోచించకుండా విమానాన్ని మార్గం మధ్యలోనే దించేశారు. 326 మంది ప్రయాణికులతో మెక్సికోలోని కాన్‌కున్‌ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న ఎయిర్‌బస్‌ ఏ330-243 విమానం.. అట్లాంటిక్‌ మహాసముద్ర గగనతలంపై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడికి సమీపంలో ఐర్లాండ్‌ దేశంలోని షానన్‌ విమానాశ్రయంలో విమానాన్ని హుటాహుటిన ల్యాండ్‌ చేశారు.

Related posts