telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వ్యాక్సిన్ పంపిణి పై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం…

corona vacccine covid-19

తొలిదశలో తెలంగాణ కు ఎన్ని వాక్సిన్ డోసుల రానున్నాయి ? అనే దాని మీద కసరత్తులు చేస్తున్నారు అధికారులు.  దేశంలో ఇప్పటికే రెండు వాక్సిన్లకు అనుమతి వచ్చేసింది.. ఏ క్షణమయినా వాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్ని వాక్సిన్ పంపిణీకి సమాయత్తం అవుతున్నాయి.. తెలంగాణ రాష్ట్రంలోకి వాక్సిన్ వచ్చిన వెంటనే అందించడానికి రంగం సిద్ధం అవుతోంది.. వెంగళరావు నగర్ లోని కుటుంబ సంక్షేమా శాఖ కార్యాలయంలో సమావేశమైన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు వాక్సిన్ పంపిణీ పై కీలకంగా చర్చించారు..  అన్నీ జిల్లాల డి ఎమ్ హెచ్ ఓ లతో సమావేశం నిర్వహించింది. తెలంగాణ లో  కోల్డ్ స్టోరేజ్ లను సిద్ధం చేశారు. రాష్ట్రానికి వాక్సిన్ ఎప్పుడు వచ్చినా  పంపిణీ చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. తొలి దశలో 80 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది వైద్య ఆరోగ్య శాఖ..ముందుగా కరోనా వారియర్స్ కి , పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఆ తరువాత 50సంవత్సరాలు దాటినా వారికి, చివరిగా 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. తెలంగాణ కు ముందుగా  5లక్షల డోసులు, ఆ తరువాత 10లక్షలు, అనంతరం కోటి డోసులు రాష్ట్రానికి రానున్నాయి.

Related posts