telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు సాంకేతిక

టిక్ టాక్ పై .. భారీ జరిమానా.. అమెరికా..

huge penalty on tik tok by america

తనకంటూ అన్నిటిలో ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా, సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తమ టాలెంట్ ను ప్రదర్శించడానికి చాలా మంది దీన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా టిక్ టాక్ యాప్ కు షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది. అమెరికా మార్కెట్ లోకి అడుగుపెట్టిన టిక్ టాక్ యాప్ మ్యూజికల్‌.ఎల్‌వై (Musical.ly) అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కొద్దికాలానికే అమెరికాలో అండ్రాయిడ్ మార్కెట్ లో నాలుగో స్థానం, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లో 25వ స్థానాన్ని దక్కించుకుంది.

13 ఏళ్లలోపు చిన్నారుల వ్యక్తిగత వివరాలను(పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు) బహిర్గతం చేయడం ద్వారా టిక్ టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీని దోషిగా తేలుస్తూ ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయమై టిక్ టాక్ స్పందిస్తూ.. తాము నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపింది. 13 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి యాక్సెస్ కల్పించలేదనీ, యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో 6.5 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లు ఉన్నారు.

Related posts