telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన కొడాలి నాని !

చంద్రబాబుకు సిఐడి నోటీసులు రావడం ఇంకా ఏపీలో హల చల్ చేస్తూనే ఉంది. అయితే అమరావతి భూముల అక్రమాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు నిన్న నోటీసులు ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు.. 41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే…దీనిపై చంద్రబాబు హైకోర్టు ఆశ్రయించారు. ఐతే ఈ నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, నారాయణపై విచారణ చేయకుండా మాత్రమే స్టే ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది. మిగతా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. అయితే.. చంద్రబాబు స్టే తెచ్చుకోవడంపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు కాదు స్టే బాబు అని మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. పలుకుబడులు ఉపయోగించి చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటారని…స్టేలు తాత్కాలికమేనని… ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు కొడాలి నాని. తిరుపతి, జడ్పీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రజలు బుద్ధి చెప్తారని చురకలు అంటించారు.

Related posts