telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘డెడ్లీ కరోనా’… కరోనా వైరస్ పై సినిమా

karona

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట కరోనా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇటలీలో కరోనా… విజృంభిస్తోంది. ఇప్పటవరకు ఆ దేశంలో 800కు పైగా మరణించారు. మరో 12వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు కూడా కరోనా బారిన పడ్డారు. తమకు కరోనా వైరస్ సోకినట్లు హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ తెలిపారు. తనతో పాటు తన భార్య రీటా విల్సన్‌కు కూడా కరోనా లక్షణాలున్నాయన్నారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ 19 వ్యాధికి గురైన ఇద్దరు ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే జనంలో కరోనాపై ఉన్న భయాల్ని… క్యాష్ చేసుకునే పనిలో పడుతున్నారు భారతదేశానికి చెందిన కొందరు సినీ దర్శకులు. అందుకే.. కరోనా వైరస్‌పై కూడా సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్‌. కరోనా వైరస్‌పై సినిమా తీస్తానని ప్రకటించారాయన. ఈ సినిమాకు ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్‌ను కూడా దర్శకుడు ఉమేశ్ రిజిస్టర్‌ చేయించారు. అయితే ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ గురించే సినిమా వస్తుండటంతో పలువురు ఆసక్తిగా సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. సూర్య తొలిసారిగా హిస్టారికల్‌ మెడికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌‌గా సెవెన్త్ సెన్స్‌లో నటించారు. అప్పట్లో ఈ సినిమాకు మురుగుదాస్ దర్శకత్వం వహించారు. కరోనా వైరస్ వచ్చినప్పుటి నుంచి అందరూ సూర్య సినిమా సెవెన్త్ సెన్స్‌ గురించే ప్రధానంగా చర్చించుకున్నారు. ఆ సినిమాలో లాగే… కరోనా వైరస్ కూడా చైనా పుట్టించిందంటూ కొందరూ చెప్పుకొచ్చారు.

Related posts