బాహుబలి సినిమా విజయంతో ప్రభాస్ అంటే దేశమంతటా తెలిసిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా ప్రభాస్ పూర్తి చేసుకున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇందులో పూజా హెగ్దె హీరోయిన్‌గా నటించారు. అయితే ఈ సినిమా 2018లో ప్రారంభం అయి దాదాపు రెండు సంవతసారాల పాటు చిత్రీకరణ జరిగింది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా సరిగా లేవని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా అతి త్వరలో విడుదల చేయనున్న సందర్భంగా ఈ సినిమా నుంచి పాటలను వరుసగా విడుదల చేయాలని చిత్ర టీమ్ సన్నద్దమవుతుందంట. ఈ సినిమా పాటల కంపోజింగ్ దాదాపు పూర్తయిందని. మొత్తం కంప్లీట్ అయిన వెంటనే పాటలను రిలీజ్ చేయడం ప్రారంభించాలని భావిస్తున్నారంట. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేద. త్వరలోనే ఈ సినిమా పాటలను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తారంని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ వార్తలు నిజామా.. అబద్దమా అనేది.
previous post
next post