telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కుమార్తెకు అన్యాయం జరిగితే ఏ తండ్రీ తట్టుకోలేడు… నేను చనిపోతా : రియా తండ్రి

Rhea

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు చేసిన ట్వీట్లకు ఇంద్రజిత్ స్పందించారు. “తన కుమార్తెకు అన్యాయం జరిగితే ఏ తండ్రీ తట్టుకోలేడు. నేను చనిపోతా. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా నా కుమార్తెను జైలుకు పంపాలని దేశం మొత్తం చూస్తోంది” అని పేర్కొన్నారు. అనంతరం సుశాంత్ గురించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. “సుశాంత్ ప్రాణాలతో ఉండగా.. డ్రగ్స్ కేసు కోర్టు వరకు వెళితే.. అతనే ప్రధాన నిందితుడిగా ఉండేవాడు. ఈ రోజు ఈ పరిస్థితి చూసి అతను కూడా బాధపడతాడు. తన ప్రియుడి వల్ల రియా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆమె అమాయకురాలు.. ఆమెకు న్యాయం జరగాలి” అని ఇంద్రజిత్ పేర్కొన్నారు.

Related posts