నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం పద్మిని పిక్చర్స్ వారి “పెంపుడు కూతురు” 06-02-1963 విడుదలయ్యింది.
నిర్మాత, దర్శకుడు బి.ఆర్.పంతులు గారు పద్మిని పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ : ఇరా షణ్ముగం, మాటలు, స్క్రీన్‌ప్లే : డి.వి.నరసరాజు, పాటలు: కొసరాజు, అనిశెట్టి, సి. నారాయణరెడ్డి, సంగీతం: టి.జి.లింగప్ప, ఛాయాగ్రహణం: వి.రామ్మూర్తి, కళ: సెల్వరాజ్, నృత్యం: పి.ఎస్.గోపాలకృష్ణ, కూర్పు: డి.దేవరాజ్ అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, జానకి, దేవిక, హరనాధ్, రేలంగి, రమణారెడ్డి, మాలతి, వల్లూరి బాలకృష్ణ(అంజి), లంక సత్యం, మల్లాది, కుట్టి పద్మిని తదితరులు నటించారు.
సంగీత దర్శకుడు టి.జి.లింగప్ప గారి సారధ్యంలో వెలువడిన పాటలు
“చెప్పిన మాటే ననుకో,ఇది చెప్పిన మాటే ననుకో”
“జీవనరాగం ఈ అనురాగం మధురానందమిదే”
“నాకు కనులు లేవు,నీవు పలుక లేవు”
“ఏవీ వెలుతురు లేవీ, నన్ను బ్రతుకు బాటలో నడిపే వెలుతురు లేవీ'”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.
ఈ చిత్రాన్ని తెలుగు,కన్నడ భాషలలో ఒకే సారి నిర్మించారు తెలుగు లో ఎన్టీఆర్ హీరో కాగా కన్నడంలో రాజకుమార్ హీరో గా చేశారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ గారి చెల్లెలు గా దేవిక నటించగా షావుకారు జానకీ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకున్నది…