telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్…

ponnala lakhmaih

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మట్లాడుతూ… నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్ అని అన్నారు. ఆయన స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత దగాకోరు ప్రభుత్వం ఇంకోటి లేదని తెలంగాణని నీళ్ళు..నిధులు… నియామకాలు నిండా ముంచాడని అన్నారు. కాళేశ్వరం నీళ్లు… సముద్రం పాలు, ఉద్యోగాలు ఖాళీ, నిధులు..దొంగల పాలయ్యాయ, అప్పులు…జనం మీద మోపారని అన్నారు. కాళేశ్వరం నుండి 102 టీంఎంసిల నీళ్లు ఎత్తి పోశామని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలన్న ఆయన ఎత్తిపోసిన నీళ్లు ఏం చేశావో చెప్పగలవా..? అని ప్రశ్నించారు. ఎల్లంపల్లి దగ్గర 2018- 19 , 19- 20 లో వచ్చిన నీళ్లు ఎంత..? సముద్రం పాలైంది ఎంత… ? చర్చకు వస్తావా..?  478 టీఎంసీ నీళ్లు ఎల్లంపల్లి దగ్గర లభ్యం అయ్యింది కదా..?  వాటిలో నువు వాడింది ఎంత.? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. తుగ్లక్ ని మించిన తుగ్లక్ కేసీఆర్ అని పేరుకొన్న ఆయన పీఆర్సీ నివేదిక లోనే లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ అని చెప్పారని 65 వేల మంది మీ హయాంలో రిటైర్డ్ అయ్యారని అన్నారు.  సింగరేణి, విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకుంటారా..? అని ప్రశ్నించిన ఆయన 40 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించారని ఆన్నారు. మునిసిపల్ స్కావెంజర్స్ ఏమయ్యారు ? అని ఆయన అన్నారు.

Related posts