telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఐదు పైసలతో కిలోమీటర్.. మార్కెట్లోకి ‘ప్యూర్ ఈవీ’ బైక్ లు!

motorcycle-motorbike

ఓ స్టార్టప్ కంపెనీ ఆటోమోబైల్ రంగంలో సరికొత్త ప్రయోగం చేసింది . ఈ కంపెనీ తయారు చేసిన బైక్ ఇప్పుడు నయా సెన్సేషన్ గా మారనుంది. కేవలం ఐదు పైసలతో ఒక కిలోమీటర్ దూరం ప్రయాణం చేయగలిగే విద్యుత్‌ వాహనాలను ఓ స్టార్టప్ కంపెనీ కనిపెట్టింది. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘ప్యూర్‌ ఈవీ’ విద్యుత్‌ బైక్ లను అందుబాటులోకి తెస్తోంది. నగర శివారులోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇప్పటికే 18,000 చదరపు అడుగుల్లో పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. నెలరోజుల్లో దేశవ్యాప్తంగా విక్రయించేలా వాహనాలను సిద్ధం చేయనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 వాహనాలను విపణిలోకి తేవాలన్నదే లక్ష్యం. ఐఐటీ హైదరాబాద్‌ ఆచార్యులు నిశాంత్‌, ఐఐటీ ముంబయికి చెందిన రోహిత్‌ 2016లోనే అంకుర సంస్థకు నాంది పలికారు.నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతాయని, రెండు యూనిట్ల విద్యుత్ అంటే రూ. 6తో చార్జింగ్ పెట్టుకుంటే, 120 కిలోమీటర్లు తిరిగి రావచ్చు.ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా పనిచేసే లిథియం అయాన్‌ బ్యాటరీలను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు నిశాంత్‌ తెలిపారు. . ఈ వాహనాలకు రూ.30,000 నుంచి రూ.70,000 మధ్య ధర నిర్ణయించామన్నారు.

Related posts