telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు జేబు సంస్థగా నిమ్మగడ్డ మార్చేశారు..

Ambati Rambabu ycp

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి.  స్థానిక సంస్థలు ఎన్నికలతో వైసీపీ, టీడీపీ ల మరోసారి రాజకీయాలు భగ్గుమన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈసీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్ ఎన్నికల సంఘాన్ని చంద్రబాబుకు జేబు సంస్థ గా మార్చటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలను ఎందుకు ఎన్నికలను నిర్వహించలేదు? రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని… లోకేష్ ఇప్పటికీ కోవిడ్ తో భయం భయంగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని… ఎన్నికల నిర్వహణ క్రమంలో ఉద్యోగుల్లో ఎవరికైనా కోవిడ్ వచ్చి చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ద వ్యవస్థ ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించటం దురదృష్టకరమని..
సభలు, సమావేశాలకు హాజరవ్వాలా వద్దా అన్నది ఆప్షన్ అని వెల్లడించారు. ఎన్నికలు అలా కాదు…అందరూ కచ్చితంగా ఓటు వేసేందుకు వచ్చే వాతావరణం కల్పించాలని సూచించారు.

Related posts