telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సోమిరెడ్డి మాటలు అవాస్తవం : ఆనందయ్య

నా మందు పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు ఆనందయ్య. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ ఆగదని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా అనందయ్య మందు పంపిణికి ఎటువంటి ఇబ్బంది లేదని నెల్లూరు ఇన్ చార్జ్ కలెక్టర్ హారింద్రప్రసాద్ పేర్కొన్నారు. కోర్టు, ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది..మేము ప్రత్యేకంగా ఇచ్చేది అంటూ ఎమీ లేదన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు.

Related posts