బీజేపీ 2022లో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడేలా చేయాలని, అదీ జమిలితోనే సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ ఏడాది ఆఖరులో జరిగే మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే విడిగా జరిగే తుది ఎన్నికలవుతాయని, వీటికి కూడా మరో మూడేళ్లలో మళ్లీ జమిలి ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగక తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న రీత్యా త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని జేడీఎస్ కు చెందిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఆలోచిస్తున్నారని, అది జరిగితే కాంగ్రెస్ లో చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తద్వారా కర్ణాటకను కూడా జమిలిలో కలిపేయవచ్చంటున్నారు.
2020లో బీహార్, ఢిల్లీ, పాండిచ్చేరి, 2021లో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీటి భవిష్యత్ ఏమిటని చర్చనీయాంశమవుతోంది. 2022లో గోవా, హిమాచల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, పంజాబ్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఒకవేళ 2022లో జమిలి ఎన్నికలు జరిపితే వీటన్నింటినీ దానితో ముడిపెట్టేయవచ్చు. ఇక 2023లో జరిగే రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను, 2024లో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టాల్సి ఉంటుంది.
పలురాష్ట్రాల్లో అసెంబ్లీ పదవీకాలం పొడిగించడమో, తగ్గించడమో చేయాల్సి ఉంటుందని, ఇందుకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ రాజ్యాంగ సవరణలను కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జమిలి ఎన్నికలకు సుముఖంగా ఉన్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో 40 పార్టీల్లో 21 పార్టీలు హాజరయ్యాయి. ఇందులో 22 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు పలకగా, సీపీఐ, సీపీఎం వ్యతిరేకించాయి. పార్టీల లోక్‌సభా బలాన్ని బట్టి చూస్తే దాదాపు 440కి మందికి పైగా ఎంపీలు జమిలి ఎన్నికలకు మద్దతు పలకడం విశేషం. రాజ్యసభలో ప్రస్తుతం మెజారిటీ లేకపోయినా 2021 నాటికి బీజేపీ మెజారిటీ సాధిస్తుందని, ప్రాంతీయ పార్టీల నుంచి వలసలు జరిగితే వచ్చే సంవత్సరమే ఎన్డీయే మెజారిటీ సాధించి జమిలి ఎన్నికలపై రాజ్యాంగ సవరణకు వీలు కలుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బిగ్ బాస్-3 : హిమజ డ్యాన్స్ పై పునర్నవి కామెంట్స్