telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెల్లరేషన్‌కార్డు లేని వారి జాబితా సిద్ధం చేయాలి: మంత్రి తలసాని

talasani srinivasayadav on clp merger

రాష్ట్రంలో తెల్లరేషన్‌కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివససా్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ తదితర అంశాలపై జీహెచ్‌ఎంసి పరిధిలోని మంత్రులు, ఎంపి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రకాల సమస్యలన చర్చించారు. లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వపరంగా అందే సాయం వారికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయని వారిని ఆదుకునేందుకు మరింతగా కృషి చేయాలన్నారు.

తెలంగాణకు చెందిన. బియ్యం పంపిణీ చేయాల్సిన వలస కూలీల వివరాలతో సమగ్ర సమాచారం సేకరించాలని అన్నారు. నగర పరిధిలో ఆహారం పంపిణీ, జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలోనే చేపట్టాలని అన్నారు. రోడ్లపై ఉన్న యాచకులను సమీపంలోని షెల్టర్‌హోమ్‌లకు తరలించాలని అన్నారు. యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు ఫంక్షన్‌హాల్స్‌, ప్రభుత్వ పాఠశాలలను షెల్టర్‌గా వినియోగించాలన్నారు. షెల్టర్‌లకు తరలించిన వారికి జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Related posts