telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 17, శుక్రవారం రాశిఫలాలు…

మేషరాశి..

మానసిక అశాంతి క‌లుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబంలో సమస్యలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్ప‌డ‌తాయి.

వృషభరాశి..

స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆక‌స్మిక ధ‌న లాభం, ముఖ్య‌మై పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల సహకారం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునరాశి..

ఇంటాబయటా ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. అనారోగ్యం బాధిస్తుంది. కుటుంబంలో కలహాలు ఏర్ప‌డ‌తాయి.శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌దు. దైవదర్శనాలు చేస్తారు. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు త‌లెత్తుతాయి.

కర్కాటక‌రాశి..

పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకోని చోటు నుంచి శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమావేశాలలో పాల్గొంటారు. రావాల్సిన చోటు నుంచి బాకీలు వసూలవుతాయి. పెళ్ళి ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో జాగ్ర‌త్త అవ‌స‌రం.

సింహరాశి..

బంధువుల నుంచి సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో విజయం అందుకుంటారు. మంచి ఆలోచ‌న‌ వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల ప్రశంసలు పొందుతారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.

కన్యరాశి..

ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులుకు మంచి జ‌రుగుతోంది. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

తులరాశి..

కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శించుకుంటారు.

వృశ్చికరాశి..

బంధు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తులు సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. చిన్న త‌ర‌హా వ్యాపారుల వారికి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సురాశి..

మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఏర్ప‌డుతుంది.

మకరరాశి..

కొన్ని వ్యవహారాలలో అడ్డంకులు ఏర్ప‌డ‌తాయి. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో ఆక‌స్మిక మార్పులు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుంది.

కుంభరాశి..

ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. మీ యత్నాలకు బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మానసిక అశాంతి క‌లుగుతుంది. దైవదర్శనాలు చేస్తారు. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు.

మీనరాశి..

మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు . కష్టానికి త‌గ్గ ఫలితం ల‌భిస్తుంది. నూతన విద్యాయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి పెరుగుతుంది. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ధ‌న‌, వస్తులాభాలు క‌లుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంత‌గా సంతృప్తినివ్వ‌వు.

Related posts