telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముంబై వీధుల్లో నన్ను పట్టుకోండి చూద్దాం… ప్రముఖ అమెరికా పాప్ సింగర్ సవాల్

Kick

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ పాప్ గాయని కాటి పెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2010వ సంవత్సరంలో కాటిపెర్రీ తన మాజీ భర్త రస్సెల్ బ్రాండ్ తో కలిసి తాజ్ మహల్, ఆగ్రాలను సందర్శించారు. తాజ్ మహల్ సందర్శన సమయంలోనే రస్సెల్బ్రాండ్ కాటిపెర్రీని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ముంబైలో ‘కాటి క్యాట్స్’ సంగీత ప్రదర్శన కోసం రావడం తనకెంతో సంతోషంగా ఉందని కాటిపెర్రీ వివరించారు. వారంరోజుల్లో ముంబై నగరంలో జరగనున్న తన సంగీత ప్రదర్శన పట్ల ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ముంబై కాటి క్యాట్ సంగీత ప్రదర్శన సందర్భంగా తాను బాలీవుడ్ నటీనటులతో కలుస్తానని ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలీన్ ఫెర్నాండేజ్ కలిసి ముంబై నగరంలో షాపింగ్ చేస్తానని కాటి చెప్పారు. ఏడేళ్ల విరామం తర్వాత ముంబై నగరంలో ‘కాటి క్యాట్’ పేరిట మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించేందుకు వారం రోజుల్లో వస్తున్న కాటి పెర్రీ ముంబై వాసులనుద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను హోటల్ గదికే పరిమితమయ్యే మహిళను కాదు… నేను ప్రపంచమంతా తిరుగుతుంటాను, నేను ప్రజలను ప్రేమిస్తాను, వివిధ వర్గాల సంస్కతీ, సంప్రదాయాలంటే నాకెంతో ఇష్టం. అందుకే నేను ముంబై నగరంలోని వీధులతోపాటు హోటళ్లు, షాపింగ్ సెంటర్లలో తిరుగుతాను…నన్ను పట్టుకోండి చూద్దాం’’ అంటూ కాటి పెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related posts