telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తమిళనాడులో పాగా వేసే దిశగా బీజేపీ…

bjp party

బీజేపీ తన పాగా వేసే దిశగా తమిళనాడులో కసరత్తు చేస్తోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడం.. బీజేపీ-అన్నాడీఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో… చెన్నైలో అమిత్ షా పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఈ క్రమంలోనే దక్షిణాన రాజకీయాల వైపు దృష్టి సారించింది. అమిత్ షా చెన్నైలో మకాం వేశారు, పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుంది బీజేపీ. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. చేదు ఫలితాలను చవి చూశాయి. ఐతే అమిత్ షా పర్యటనకు రాజకీయలకు సంబంధం లేదని.. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగానే చూస్తున్నామని అన్నాడీఎంకే నేతలు తెలిపారు. అన్నాడీఎంకేతో పొత్తును కొనసాగిస్తూనే.. కొత్త పార్టీలు, తటస్థ నేతలను కలుపుకొనే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ క్రమంలో- దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌ను పార్టీలో చేర్చుకునే దిశగా వ్యూహాలను రూపొందించుకుంది బీజేపీ. అలాగే ప్రతిపక్షాలను చీల్చే యోచనలో చీలికలకు యత్నాలు చేస్తున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది. రెండు రోజుల పాటు చెన్నైలో ఉండనున్న అమిత్ షా ఖచ్చితంగా ఈ పర్యటనలో ఏదోఒక కొత్త రాజకీయం చేసే వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

Related posts