ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేత నారా లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు వెళ్లిన లోకేశ్, అక్కడి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల నీట మునిగిన పంటలను లోకేశ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మోకాలు లోతులో వరద నీరు ప్రవహిస్తూ ఉన్నప్పటికీ అందులోనే నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. నష్టపోయిన ప్రజలందరిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతానని స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా లోకేశ్ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా నారా లోకేశ్ బుల్లెట్ బైక్ నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నారా లోకేశ్ బైక్ ను నడుపుకుంటూ ముందుకు వెళుతుండగా, పలువురు మద్దతుదారులు వెంట వచ్చారు.