telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

నిర్మలమ్మ బడ్జెట్‌తో ఆమాంతం పడిపోయిన పసిడి ధరలు !

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు కాస్త తగ్గిపోయాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గడంతో రూ. 52,270కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరగడంతో రూ. 48,150కు చేరుకుంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గడంతో రూ. 49,640 కు చేరుకుంది… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గడంతో రూ. 45,500 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ. 4600 పెరిగి రూ. 79200గా నమోదైంది.

Related posts